విజయవాడ కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు బిగ్ రిలీఫ్
- వరకట్న వేధింపుల కేసు కొట్టివేత
- నేరారోపణలు రుజువు కాకపోవడంతో అనుకూలంగా తీర్పు
- అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ కేసు పెట్టిన భార్య శ్రీలక్ష్మీ
కాగా అదనపు కట్నం కోసం పృథ్వీరాజ్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఆయన భార్య శ్రీలక్ష్మి 2016లో కేసు పెట్టారు. ఈ కేసుపై 2017లో రెండో ఏసీఎంఎంలో ఛార్జిషీట్ దాఖలైంది. అప్పటినుంచి వాదనలు కొనసాగుతుండగా బుధవారం తీర్పు వెలువడింది.
పెళ్లి సమయంలో డబ్బు, బంగారు నగలు ఇచ్చినా ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో నటించే ఆయన హైదరాబాద్ వెళ్లిన తర్వాత వ్యసనాలకు అలవాటు పడ్డారని, తనను పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు చేయడంతో విజయవాడలోని సూర్యారావుపేట స్టేషన్‌లో సెక్షన్ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.