సీఎం రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
- గ్లోబరీనా టెక్నాలజీస్‌పై చేసిన ఆరోపణలపై వివాదం
- 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
- లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ చేసిన ఆరోపణలపై 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరువు నష్టం దావాతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. గ్లోబరీనా సంస్థలో తనకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు, యాజమాన్య హక్కులు లేదా బినామీ ప్రయోజనాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సదరు సంస్థ తన బినామీ అని, సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించానని చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, రాజకీయ ప్రత్యర్థిపై ఇటువంటి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.