ఎల్లుండి నుంచి వారాహి మాత దీక్ష చేపట్టనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- జూన్ 26 నుంచి పవన్ వారాహి దీక్ష
- 11 రోజుల పాటు కొనసాగనున్న దీక్ష
- గతేడాది కూడా దీక్ష చేపట్టిన జనసేనాని
2023 జూన్ లో పవన్ కల్యాణ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ యాత్రల కోసం ప్రత్యేక వాహనం తయారుచేయించుకున్న పవన్ కల్యాణ్ దానికి 'వారాహి' అని పేరుపెట్టిన సంగతి తెలిసిందే. నాడు యాత్ర సందర్భంగా పవన్ వారాహి అమ్మ వారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.