Venkata Gowda: పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్ లు అందించిన పలమనేరు ఎమ్మెల్యే... ఈసీ ఆగ్రహం

EC fires on Palamaneru MLA Venkate Gowda
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కోడ్ అమల్లో ఉన్న సమయంలో పదో తరగతి విద్యార్థులకు తన ఫొటోలతో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేసిన పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే ఎన్. వెంకట గౌడ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకట గౌడ ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడంటూ ఈసీ చర్యలకు దిగింది. 

ఎమ్మెల్యే ఫొటోలతో ఉన్న ప్యాడ్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడాన్ని పలమనేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎగ్జామినర్లు గమనించారు. దీనిపై వారు పలమనేరు ఆర్డీవో మనోజ్ రెడ్డికి సమాచారం అందించారు. దాంతో, ఆర్డీవో పలమనేరు ఎమ్మెల్యేపై వి.కోట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ క్రమంలో అధికారులు పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడకు షోకాజ్ నోటీసులు అందించారు.
Go Back to Shorts
Venkata Gowda
EC
Election Code
Palamaneru
YSRCP

More Telugu News