Advertisement

యువత భవిష్యత్తుకు హాని చేసిందే మీరు.. ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ కౌంటర్‌

Rahul Gandhi slams PM Modi for destroying the national education system
  • విద్యా వ్యవస్థను కేంద్రం ధ్వంసం చేసిందని ఆరోపణ
  • ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌
  • విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని పట్టు
  • ఆందోళనకారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌
యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమంటూ నీట్‌ పేపర్‌ లీక్‌పై స్పందించిన ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కౌంటర్‌ ఇచ్చారు. దేశ యువత భవిష్యత్తుకు హాని చేసిందే మీరంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.

ఈ మేరకు గురువారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించిన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌.. దేశ విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన వారిని రక్షించిందని పేర్కొన్నారు.

విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని రాహుల్‌ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, జంతర్‌మంతర్‌లో ఆందోళన చేసిన విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసుల్లో వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని అంతకుముందు మోదీ ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. మోదీ ప్రకటన వెలువడిన కాసేపటికే రాహుల్‌ గాంధీ పై వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Advertisement
Rahul Gandhi
Narendra Modi
NEET Paper Leak
Dharmendra Pradhan
Education Ministry
Congress Party

More Telugu News