హైదరాబాద్ లో ఆగిన తర్వాత ముగ్గురు పైలట్లకు అస్వస్థత.. బ్రిటిష్ ఎయిర్‌వేస్ దర్యాప్తు
- బ్రిటిష్ ఎయిర్‌వేస్ పైలట్లకు అస్వస్థత
- ఫుడ్ పాయిజనింగ్ అనుమానంతో దర్యాప్తు
- ఒక పైలట్‌కు విమానంలోనే ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి
- లండన్ చేరుకున్నాక పైలట్‌కు చికిత్స
- ప్రయాణికుల భద్రతకు ముప్పు లేదన్న బ్రిటిష్ ఎయిర్‌వేస్
- హోటల్ భోజనం, తాగునీటిపై కొనసాగుతున్న దర్యాప్తు
హైదరాబాద్‌లో రాత్రి బస చేసిన అనంతరం లండన్‌కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలోని ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి లండన్ హీత్రోకు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ బీఏ276 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం సుమారు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక పైలట్‌కు తీవ్ర అస్వస్థత కలగడంతో విధులు నిర్వర్తించే పరిస్థితి లేకుండా పోయింది. అతడికి విమానంలోనే ఆక్సిజన్ అందించగా, లండన్‌లో దిగిన వెంటనే వైద్య చికిత్స అందించారు.
మిగిలిన ఇద్దరు పైలట్లు కూడా అస్వస్థత లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చినట్లు సమాచారం. అయితే ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడలేదని బ్రిటిష్ ఎయిర్‌వేస్ స్పష్టం చేసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లోని హోటల్‌లో ముగ్గురు పైలట్లు కలిసి అల్పాహారం తిన్నారు. అలాగే బయటి సంస్థ సరఫరా చేసిన బాటిల్ వాటర్‌ను తాగినట్లు తెలిసింది. దీంతో ఆహారం లేదా తాగునీటి వల్లే అస్వస్థతకు గురయ్యారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనపై ముగ్గురు పైలట్లు ఎయిర్ సేఫ్టీ రిపోర్టులు సమర్పించగా, అస్వస్థతకు గల కారణాలను గుర్తించేందుకు నమూనాలను కూడా సేకరించారు. హైదరాబాద్‌లో సిబ్బంది బస చేసే హోటల్ ఏర్పాట్లను కూడా సమీక్షిస్తున్నట్లు బ్రిటిష్ ఎయిర్‌వేస్ వెల్లడించింది.