ప్రపంచ అనిశ్చితుల మధ్యా భారత్ బలంగా ముందుకు సాగుతోంది: ఆర్‌బీఐ
- వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటన్న ఆర్‌బీఐ
- జూన్ వరకు ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగినట్లు వెల్లడి
- పారిశ్రామిక, సేవారంగాల పనితీరు స్థిరంగా ఉందని భరోసా
- ఎగుమతులు, దిగుమతుల్లో వృద్ధి కొనసాగిందని వెల్లడి
- ఎఫ్‌డీఐ, ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగినట్లు తెలిపిన ఆర్‌బీఐ
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ.. భారత్ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. జూన్ వరకు దేశ ఆర్థిక కార్యకలాపాల్లో వృద్ధి కొనసాగిందని, పారిశ్రామిక, సేవారంగాల పనితీరు బలంగానే ఉందని జులై బులెటిన్‌లో వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు కొన్ని ప్రాంతాల్లో అసమానంగా కురుస్తున్నప్పటికీ.. తగినన్ని ఆహార ధాన్య నిల్వలు ఉండటంతో ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని తెలిపింది. 2026-27 తొలి త్రైమాసికంలో ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పెరగడంతో విదేశీ వాణిజ్యం బలంగా కొనసాగుతోందని పేర్కొంది. ఇటీవల అమల్లోకి వచ్చిన భారత్-బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం, ఇతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో పురోగతి దీనికి మరింత ఊతమివ్వొచ్చని అంచనా వేసింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసం తిరిగి బలపడుతున్న సంకేతమని ఆర్‌బీఐ పేర్కొంది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినా, ప్రధాన ఇన్‌ఫ్లేషన్ మాత్రం దిగువ స్థాయిలోనే ఉందని వెల్లడించింది.
దేశీయ డిమాండ్, పారిశ్రామిక, సేవారంగాల స్థిరమైన పనితీరు కారణంగా ప్రపంచ సవాళ్లను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని, విదేశీ రంగానికి సంబంధించిన కీలక సూచీలు కూడా స్థిరంగా ఉన్నాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.