ప్రపంచకప్ ముగిశాక అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు ఊహించని పరిణామం
- అమెరికాలో అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడికి చుక్కెదురు
- విమానం ఎక్కే ముందు ఏఎఫ్ఏ చీఫ్ టాపియాను ప్రశ్నించిన ఎఫ్‌బీఐ
- వందల మిలియన్ డాలర్ల మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ
- అధ్యక్షుడిని విచారించలేదన్న ఏఎఫ్ఏ.. థర్డ్ పార్టీకి సమన్లు జారీ అయినట్లు వెల్లడి
- 300 మిలియన్ డాలర్ల నిధులపై అమెరికా ఏజెన్సీల దర్యాప్తు
2026 ఫీఫా ప్రపంచకప్ ముగిసిన తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు అమెరికా నుంచి తిరుగుపయనం అవుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) అధ్యక్షుడు క్లాడియో 'చికి' టాపియాను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు ప్రశ్నించారు. వందల మిలియన్ డాలర్ల స్పాన్సర్‌షిప్ డబ్బును యూఎస్ బ్యాంకుల ద్వారా లాండరింగ్ చేశారన్న ఆరోపణలపై ఈ విచారణ జరిగినట్లు తెలుస్తోంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ప్రపంచకప్ ముగిశాక అర్జెంటీనా జట్టు సభ్యులతో కలిసి టాపియా స్వదేశానికి చార్టర్ ఫ్లైట్‌లో బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. విమానం ఎక్కడానికి కొద్ది క్షణాల ముందు యూఎస్ దర్యాప్తు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఎయిర్‌పోర్ట్‌లోని బస్సులోనే టాపియాతో పాటు ఏఎఫ్ఏ కోశాధికారి పాబ్లో టోవిగ్గినోను సుమారు 30 నిమిషాల పాటు ప్రశ్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో టాపియా ఫోన్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం కూడా జరగ్గా, ఏఎఫ్ఏ దానిని ఖండించింది.
ఈ పరిణామాలపై ఏఎఫ్ఏ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ అధ్యక్షుడు టాపియా గానీ, కోశాధికారి టోవిగ్గినో గానీ సాక్ష్యం ఇవ్వాలని యూఎస్ కోర్టులు ఆదేశించలేదని స్పష్టం చేసింది. అయితే, తమ సంస్థ అధికారులతో సహా పలువురి గురించి సాక్ష్యం ఇచ్చేందుకు ఒక థర్డ్ పార్టీని యూఎస్ గ్రాండ్ జ్యూరీ ముందు హాజరుకావాలని సమన్లు పంపిన మాట వాస్తవమేనని అంగీకరించింది. ఆ థర్డ్ పార్టీ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.
'ఇన్‌ఫోబే' అనే మీడియా సంస్థ కథనం ప్రకారం.. ఏఎఫ్ఏకు సంబంధించిన 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,896కోట్లు)కు పైగా వాణిజ్య ఒప్పందాలపై యూఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏఎఫ్ఏకు చెందిన నగదును మనీ లాండరింగ్ లేదా మోసం చేసే ఉద్దేశంతో అమెరికా బ్యాంకుల ద్వారా తరలించారా అనే కోణంలో విచారణ సాగుతోంది. బ్యాంక్ రికార్డుల ప్రకారం మిలియన్ల కొద్దీ డాలర్లు యూఎస్‌లోని వివిధ ఆర్థిక సంస్థల ద్వారా బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఈ నిధులను కొద్ది రోజులు మాత్రమే ఖాతాల్లో ఉంచి, ఆ తర్వాత ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు తేలడంతో దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.