ఝార్ఖండ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!
- హేమంత్ సోరెన్ అరెస్ట్‌తో ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం
- ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం హైదరాబాద్‌కు తరలింపు
- ఏఐసీసీ సూచనల మేరకు క్యాంపును ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం నేత, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. నిన్న ఆయన నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నించి... ఆ తర్వాత అరెస్ట్ చేశారు. అంతకుముందు హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. దీంతో జేఎంఎం సీనియర్ నేత చంపయ్ సోరెన్‌ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.
అయితే ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు. రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వీరికి క్యాంప్‌ను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.