college student suicide: వీడియో గేమ్స్‌కు బానిసై ఆత్మహత్య చేసుకున్న కాలేజీ విద్యార్థి!

A college student committed suicide being addicted to video games
  • హైదరాబాద్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
  • ఉరివేసుకొని చనిపోయిన యువకుడు
  • ఆత్మహత్యకు నిర్ధిష్ట కారణం ఏంటో తెలియలేదన్న యువకుడి తల్లి
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. వీడియో గేమ్స్‌కు బానిసైన ఓ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఉరివేసుకొని చనిపోయాడని పోలీసులు శనివారం వెల్లడించారు. రెండు రోజుల క్రితం తన నివాసంలోనే ఈ విపరీతమైన చర్యకు పాల్పడ్డాడని, తల్లి గుర్తించి ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదని వివరించారు. అయితే సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్యకు నిర్దిష్ట కారణం ఏంటనేది తెలియడంలేదని యువకుడి తల్లి చెప్పినట్టుగా పోలీసులు పేర్కొన్నారు

యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన వీడియో గేమ్స్ ఏవనేది కూడా తెలియరాలేదు. సూసైడ్ నోట్ రాయకపోవడంతో కారణం స్పష్టంగా వెల్లడికాలేదు. స్నేహితులు కూడా ఎలాంటి కారణాన్ని చెప్పలేకపోతున్నారని పోలీసులు తెలిపారు. దాదాపు వారం రోజులుగా యువకుడు కాలేజీకి రావడంలేదని తెలిసిందని వివరించారు.
college student suicide
Hyderabad
video games
Telangana

More Telugu News