ప్రపంచకప్‌కు ముందు అదే టెన్షన్.. ఆ రెండు విభాగాల్లో తాము వీక్ అన్న కెప్టెన్ గిల్
- విండీస్‌పై సిరీస్ గెలిచినా కొన్ని లోపాలపై దృష్టి సారించిన కెప్టెన్ గిల్
- ఫీల్డింగ్, డెత్ ఓవర్ల బౌలింగ్‌లో ఇంకా మెరుగుపడాలని వ్యాఖ్య
- సిరీస్ మొత్తంలో ఆరు, ఏడు క్యాచ్‌లు జారవిడవడంపై అసంతృప్తి
- చివరి వన్డేలో స్లో ఓవర్ రేట్ కూడా ప్రభావం చూపిందన్న గిల్
- ప్రపంచకప్‌కు ముందు ఫీల్డింగ్ అత్యున్నత స్థాయిలో ఉండాలని స్పష్టీకరణ
వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, ఈ సిరీస్ విజయం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. ముఖ్యంగా ఫీల్డింగ్, డెత్ ఓవర్ల బౌలింగ్ విభాగాల్లో జట్టు ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉందని గిల్ స్పష్టం చేశాడు. నిన్న న్యూ చండీగఢ్‌లో జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు.
మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ కార్యక్రమంలో గిల్ మాట్లాడుతూ.. "ఈ సిరీస్‌లో చాలా విషయాలు మాకు అనుకూలంగా జరిగాయి. అయితే, కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మూడో వన్డేలో మేము 351 పరుగులు చేయడం మంచి స్కోరే. చాలా సేపటి వరకు మ్యాచ్ మా నియంత్రణలోనే ఉంది. కానీ చివరి దశలో వెస్టిండీస్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకుంది" అని తెలిపాడు.
స్లో ఓవర్ రేట్ కూడా జట్టును దెబ్బతీసిందని, నిర్ణీత సమయానికి నాలుగు ఓవర్లు వెనుకబడి ఉండటంతో డెత్ ఓవర్లలో ఫీల్డింగ్ నిబంధనలు ప్రతికూలంగా మారాయని వివరించాడు. డెత్ బౌలింగ్ గురించి గిల్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
ప్రత్యర్థి జట్టు ఐదారు వికెట్లు కోల్పోయినప్పుడు అటాకింగ్ బౌలింగ్ వేయాలా లేక పరుగులు కట్టడి చేస్తూ డిఫెన్సివ్‌గా ఆడాలా అనే వ్యూహంపై కొన్నిసార్లు అనిశ్చితి నెలకొంటోందని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంపై మరింత స్పష్టత అవసరమని సూచించాడు.
అన్నింటికంటే ముఖ్యంగా ఫీల్డింగ్‌పై గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ మొత్తంలో తమ ఫీల్డర్లు సుమారు ఆరు నుంచి ఏడు క్యాచ్‌లను జారవిడిచారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి ముందు ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వ్యాఖ్యానించాడు.
జట్టు పురోగతిపై తాను సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, ఫీల్డింగ్ మాత్రం అత్యున్నత స్థాయిలో ఉండాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని స్పష్టం చేశాడు.