Advertisement

మొన్న చిరంజీవి, నిన్న ఎన్టీఆర్.. నేడు మహేశ్‌బాబును కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో.. విషయం ఏమై ఉంటుందబ్బా!

Netflix CEO Ted Sarandos Met With Mahesh Babu
  • టాలీవుడ్ బిగ్ స్టార్స్‌ను గ్యాప్ లేకుండా కలుస్తున్న టెడ్ సరండోస్
  • నటులను కలుస్తూ.. లంచ్ చేస్తూ మంతనాలు
  • ఫ్యూచర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించి చర్చించామన్న మహేశ్‌బాబు
నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ టాలీవుడ్ స్టార్ నటులను వరుసపెట్టి కలుస్తూ బిజీగా మారిపోయారు. ఇటీవల చిరంజీవిని కలిసి ఆయన ఇంట్లోనే లంచ్ చేసిన సరండోస్.. రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, విక్కీలతో ముచ్చటించారు. నిన్న నందమూరి కుటుంబంతో హ్యాపీగా గడిపారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆయన ఇంట్లోనే లంచ్ చేశారు. కల్యాణ్ రామ్, కొరటాల శివతో మాట్లాడారు. 

తాజాగా ‘గుంటూరు కారం’ సినిమా సెట్లో మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ను కలిశారు. ఇలా టాలీవుడ్ బిగ్ స్టార్స్‌ను ఆయన వరుసగా కలుస్తుండడం వెనక ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. టెడ్ సరండోస్‌, ఆయన టీం మోనికా షెర్గిల్, అభిషేక్ గోరాడియాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన మహేశ్‌బాబు.. భవిష్యత్ ఎంటర్‌టైన్మెంట్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నట్టు పేర్కొన్నారు. సరండోస్ వరుస సమావేశాలపై టాలీవుడ్‌లో విపరీతంగా చర్చ జరుగుతోంది.
Advertisement
Mahesh Babu
Netflix
Ted Sarandos
Guntur Kaaram
NTR
Chiranjeevi

More Telugu News