కాంగ్రెస్ నేతలు నా రూమ్‌కు వచ్చి బెదిరించారు: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఆరోపణలు
- మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కాంగ్రెస్ నాయకులు తన హోటల్ గదికి వచ్చి బెదిరించారన్న ప్రీతిరెడ్డి
- మహిళలు, పురుషులు... మొత్తం పాతికమంది వచ్చారని ఆరోపణ
- కాంగ్రెస్ ఓడిపోతుందని అర్థమై వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శ
తనను నోటికి వచ్చినట్లు తిడుతూ భయపెట్టారని అన్నారు. వాళ్లు తనను ఎందుకు తిడుతున్నారో కూడా అర్థం కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని వారికి అర్థమైందని, అందుకే ఏం చేయలేక బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు సరికాదన్నారు. ఇలా రౌడీయిజం... గూండాయిజం చేసేవారికి ఓట్లు వేయవద్దని ప్రీతిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.