కరీంనగర్‌లో దొంగల బీభత్సం.. కుటుంబాన్ని బంధించి భారీ దోపిడీ
- కరీంనగర్‌లో భారీ దోపిడీకి పాల్పడిన సాయుధ ముఠా
- ఒక ఇంట్లోకి చొరబడి 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు అపహరణ
- కుటుంబ సభ్యులను కత్తులు, రివాల్వర్లతో బెదిరించి దాడి చేసిన దుండగులు
- దొంగలు ఉత్తరాది యాసతో హిందీలో మాట్లాడారని బాధితుల ఫిర్యాదు
- మూడు నెలల క్రితం పీఎంజే జ్యువెలరీ షాపులో ఇదే తరహాలో దోపిడీ
తెలంగాణలోని కరీంనగర్ పట్టణంలో మరోసారి భారీ దోపిడీ జరిగింది. నిన్న రాత్రి భగత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి చొరబడిన సాయుధ ముఠా, కుటుంబ సభ్యులను కత్తులు, రివాల్వర్లతో బెదిరించి 66 తులాల బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లింది. ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 8 మంది సభ్యులున్న ముసుగు ముఠా ఈ దోపిడీకి పాల్పడింది. ఇంటి యజమాని అజ్మత్ అలీ రాత్రి పడుకునే ముందు లైట్లు ఆర్పడానికి మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చినప్పుడు దుండగులు అతడిని పట్టుకున్నారు. నోటికి టేపు వేసి, ఇంట్లోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అనంతరం అజ్మత్ అలీ భార్య, ఇద్దరు కుమార్తెలపై కూడా దాడి చేశారు. ఎవరైనా కేకలు వేస్తే చంపేస్తామని కత్తులు, రివాల్వర్లతో బెదిరించారు.
కుటుంబ సభ్యులందరినీ తాళ్లతో కట్టేసి, 66 తులాల బంగారం, రూ. 21 లక్షల నగదు, 10 తులాల వెండిని దోచుకున్నారు. అనంతరం బాధితులందరినీ ఒకే గదిలో బంధించి బయట నుంచి తాళం వేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు వారి మొబైల్ ఫోన్లను కూడా లాక్కున్నారు. అంతేకాకుండా కింద పార్క్ చేసి ఉన్న రెండు మోటార్‌బైక్‌లను కూడా తీసుకుని వేములవాడ బైపాస్ మీదుగా పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దొంగలు ముసుగులు ధరించి ఉన్నారని, ఉత్తరాది యాసతో హిందీలో మాట్లాడుతున్నారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఇంటి యజమాని దినచర్య, ఇంట్లో బంగారం, నగదు ఉన్నాయనే కచ్చితమైన సమాచారంతోనే వారు ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
కాగా, కరీంనగర్‌లో మూడు నెలల వ్యవధిలో ఇది రెండో భారీ దోపిడీ కావడం గమనార్హం. మే 3న పీఎంజే జ్యువెలరీ షాపులో పట్టపగలే దోపిడీ జరిగింది. ఆ ఘటనలో దుండగులు కాల్పులు జరపగా.. నలుగురు ఉద్యోగులు గాయపడ్డారు. అప్పట్లో 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఆ కేసులో బీహార్‌కు చెందిన సుబోధ్ సింగ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించి, కొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జరిగిన ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.