నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ... పటేల్ రమేశ్ రెడ్డికి కాంగ్రెస్ ముఖ్య నేతల బుజ్జగింపులు
- సూర్యాపేట నుంచి టిక్కెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేశ్ రెడ్డి
- ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
- బుజ్జగించేందుకు రమేశ్ రెడ్డి ఇంటికి మల్లు రవి, రోహిత్ చౌదరి
పటేల్ రమేశ్ రెడ్డిని బుజ్జగించేందుకు వచ్చిన నేతలను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ఆయనకు అన్యాయం చేశారని, నామినేషన్ ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాల్సింది రమేశ్ రెడ్డి కాదని.... రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని అన్నారు. చర్చలు జరుపుతుండగా వారు కూర్చున్న గదివైపు రాళ్లు విసిరారు. మల్లు రవి, రోహిత్ చౌదరిలు బయటకు వెళ్లకుండా గదికి తాళం వేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది.