ఆంధ్రావాళ్లకు, మనకు జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు: గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు
- ఆంధ్రావాళ్లు... ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను దోచుకునేందుకు సిద్ధమయ్యారన్న గంగుల
- కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ని గెలిపిస్తే ప్రజలకు చేసిందేమీ లేదని వ్యాఖ్య
- ఒక్కరోజు కూడా గ్రామాల ముఖం చూడని వ్యక్తిని ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తే చేసేదేమీ ఉండదని వ్యాఖ్య
కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ను గెలిపిస్తే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఒక్కరోజు కూడా గ్రామాల ముఖం చూడని వ్యక్తిని ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసేదేమీ ఉండదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగలకు ఓటు వేసి పవిత్రమైన ఓటును వృథా చేసుకోవద్దన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే సుభిక్షంగా ఉంటుందని, ఇతర పార్టీల చేతిలో మోసపోతే ఇబ్బందిపడక తప్పదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు దొంగలు.. మోసగాళ్లు అన్నారు. వారి పట్ల తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.