బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ 22 మందికే టిక్కెట్ ఇచ్చింది: తలసాని
- బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని తలసాని ధీమా
- మేనిఫెస్టోలో లేని వాటిని కూడా బీఆర్ఎస్ ఇచ్చిందన్న తలసాని
- కాంగ్రెస్ బీసీ నేతలు టిక్కెట్ల కోసం ఢిల్లీలో ధర్నాలు చేశారని వ్యాఖ్య
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్నారు. ప్రజలు అతని భాషను గమనించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఒక్కడికే ఆ భాష వస్తుందా? అన్నారు. తమకు టిక్కెట్లు దక్కలేదని కాంగ్రెస్ బీసీ నేతలు ఢిల్లీలో ధర్నా చేసిన విషయం కూడా చూశామన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు షో, 25న కేసీఆర్ బహిరంగ సభ ఉంటాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభంజనం ఉంటుందన్నారు.