మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో గాయపడ్డ ఫేస్బుక్ అధినేత.. ఎడమకాలికి ఆపరేషన్
- వచ్చే ఏడాది జరగనున్న మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్‌కు మార్క్ జుకర్బుర్గ్ ట్రైయింగ్
- శిక్షణలో ఉండగా ఎడమ మోకాలి లింగ్మెంట్కు గాయం
- ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స
- సోషల్ మీడియాలో విషయాన్ని వెల్లడించిన జుకర్‌బర్గ్
‘‘మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటుండగా గాయమైంది. ఇప్పుడే ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. వచ్చే ఏడాది జరగబోయే మ్యాచ్‌కు ట్రెయినింగ్ తీసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. గాయం కారణంగా మ్యాచ్‌లో జాప్యం జరుగుతుంది. ఈ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. నాకు మద్దతుగా నిలుస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అంటూ మార్క్ కామెంట్ చేశాడు. త్వరలో ఎలాన్ మస్క్‌తో మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొంటానని గతంలో మార్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.