పలు జిల్లాల్లో వడగళ్ల వాన... ఆరెంజ్ అలర్ట్ జారీ
- భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్, జనగామ, యాదాద్రి తదితర ప్రాంతాల్లో వర్ష సూచన
- ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 కి.మీ. వేగంతో వడగళ్ల వాన పడవచ్చు
- బుధవారం నుండి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
ఈ మేరకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మంగళవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడే సూచనలున్నాయని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు పడుతాయని తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.