హైదరాబాద్లో మళ్లీ కుమ్మేసిన వాన.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
- గత రాత్రి నగరంలో భారీ వర్షం
- తేరుకోకముందే మరోమారు కుమ్మేసిన వాన
- ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న అధికారులు
- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, బల్దియా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా, నగరంలో నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.