సినిమాలకు విరామం ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో సుదీప్
- విక్రాంత్ రోణ తర్వాత మరో సినిమా చేయని సుదీప్
- ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డానన్న కన్నడ స్టార్
- త్వరలోనే తన నుంచి ప్రకటన వస్తుందని వెల్లడి
‘నా స్నేహితులందరికీ నమస్కారం. నేను సినిమాలు త్వరగా చేయడం లేదని, నా 46వ సినిమా అప్ డేట్స్ ఇవ్వడం లేదని వస్తోన్న మీమ్స్, ట్రోల్స్ చూస్తున్నాను. అయితే, విక్రాంత్ రోణ వంటి సినిమాలు తీసిన తరువాత నేను చాలా అలిసిపోయాను. కాస్త విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇది నా మొదటి విరామం. కరోనా టైంలో ఎంతో కష్టపడి ఆ సినిమాను తీశాం. బిగ్ బాస్ షోకు కూడా అదే టైంలో పని చేశాను. అందుకే నా కొరకు, నా సంతోషం కోసమే ఇలా బ్రేక్ తీసుకున్నాను. ఈ విరామంలో క్రికెట్ ఆడుకుంటూ ఉంటే నాకు ఎంతో రిలాక్సింగ్‌గా ఉంది. దాన్ని ఆస్వాదిస్తూనే రోజూ కథలు వింటున్నా. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్‌లు ఓకే అయ్యాయి. మూడు స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి. త్వరలోనే ప్రకటన వస్తుంది’ అని ట్వీట్ చేశారు.