కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై పేర్ని నాని తీవ్ర విమర్శలు
- ఆంధ్రప్రదేశ్ కు ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలుసన్న పేర్ని నాని
- టీఆర్ఎస్ నేతలు ఏపీని మోసం చేశారని మండిపాటు
- ఏపీలో కేసీఆర్ చేసేదేముందని ఎద్దేవా
మరోవైపు, బీఆర్ఎస్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఏపీలో కేసీఆర్ చేసేదేముందని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలుసని... టీఆర్ఎస్ నేతలు ఆంధ్రప్రదేశ్ ని మోసం చేశారని విమర్శించారు. ఇప్పటి వరకు విద్యుత్ పెండింగ్ బకాయిలను కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదని... శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి అక్రమంగా విద్యుత్ ను తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసిన టీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు ఏపీ సంక్షేమం గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని పేర్ని నాని అన్నారు. అయినా, గత ఎన్నికల్లో కేఏ పాల్ కూడా ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేశారని.. ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పేముందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.