రాహుల్ గాంధీకి భారీ ఊరట.. సావర్కర్ వ్యాఖ్యల కేసు కొట్టేసిన సుప్రీం
- క్రిమినల్ కేసు, దిగువ కోర్టు సమన్లు రద్దు
- యూపీ ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని గుర్తించిన సుప్రీం
- 2022 భారత్ జోడో యాత్రలో రాహుల్ వ్యాఖ్యలు
- 153ఏ, 505 సెక్షన్ల కింద దిగువ కోర్టు సమన్లు
- ప్రభుత్వ అనుమతి తీసుకోలేదంటూ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు
సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న క్రిమినల్ పరువునష్టం కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేసు కొనసాగించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అనుమతి పొందలేదని కోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అవసరమైన ప్రభుత్వ అనుమతి లేకుండా కేసు కొనసాగించలేమని పేర్కొంటూ రాహుల్ గాంధీ పిటిషన్‌ను అనుమతించింది. దీంతో దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను కూడా రద్దు చేసింది.
2022లో మహారాష్ట్రలో సాగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ సావర్కర్‌పై వ్యాఖ్యలు చేశారు. సావర్కర్ బ్రిటీషర్లకు సేవకుడిగా వ్యవహరించారని, బ్రిటీష్ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై న్యాయవాది నృపేంద్ర పాండే దిగువ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ వ్యాఖ్యలు పరువునష్టం కలిగించడంతో పాటు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు.
దీంతో దిగువ కోర్టు ప్రాథమికంగా కేసు విచారణకు అర్హమైనదేనని భావించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 153ఏ, 505 సెక్షన్ల కింద రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.
అయితే సుప్రీంకోర్టు విచారణలో కీలక లోపం బయటపడింది. ఈ సెక్షన్ల కింద కేసు కొనసాగించేందుకు అవసరమైన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని తేలింది. దీంతో ఆ లోపాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు మొత్తం క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది.