కేంద్ర మంత్రి నడ్డాకి అస్వస్థత.. యాంజియోగ్రఫీ చేసిన ఎయిమ్స్‌ వైద్యులు

Union Minister Unwell AIIMS Doctors Perform Angiography
  • ఛాతీలో అసౌకర్యంతో ఎయిమ్స్‌లో చేరిన నడ్డా
  • కరోనరీ యాంజియోగ్రఫీ చేసిన వైద్యులు
  • ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
  • కార్డియాలజీ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ప్రకటన
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. వైద్యులు ఆయనకు కరోనరీ యాంజియోగ్రఫీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్‌ వెల్లడించింది.

ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగంలో నడ్డా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. అస్వస్థతకు కారణాలపై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి తెలిపింది.

ఆగస్టు 13 సాయంత్రం నడ్డాకు అస్వస్థతగా అనిపించడంతో పరీక్షలు నిర్వహించినట్లు ఎయిమ్స్‌ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగానే కరోనరీ యాంజియోగ్రఫీ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం నడ్డా ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేసింది. మరికొంత సమయం వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
Advertisement
JP Nadda
AIIMS Delhi
Union Health Minister
Coronary Angiography
Cardiology Department
Health Update

More Telugu News