4 సెకన్ల పాటు పనిచేయకుండా పోయిన ఫుకెట్-ఢిల్లీ విమానం.. నివేదికలో విస్తుపోయే విషయాలు!
- ఫుకెట్-ఢిల్లీ విమానంలో సాంకేతిక లోపం
- మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు విఫలం కావడంతో తప్పిన నియంత్రణ
- ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు, సిబ్బందికి గాయాలు
- విమానం పైలట్‌కు డ్రగ్స్ టెస్టులో గంజాయి తీసుకున్నట్టు నిర్ధారణ
- పైలట్లందరికీ డ్రగ్స్ టెస్టులు తప్పనిసరి చేసిన ఎయిరిండియా
ఎయిరిండియా విమానంలో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్‌బస్ A320నియో విమానం గాల్లో ఉండగా అకస్మాత్తుగా నియంత్రణ తప్పి, సుమారు 300 అడుగుల మేర కిందకు పడిపోయింది. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటనలో కనీసం 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. విమానం పైలట్-ఇన్-కమాండ్ డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలడం సంచలనం రేపుతోంది.
ఎన్డీటీవీ ప్రాఫిట్ సేకరించిన విమాన ఫ్లైట్ డేటా రికార్డర్ విశ్లేషణ ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో విమానంలోని మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు ఒకేసారి విఫలమయ్యాయి. దీనివల్ల సుమారు నాలుగు సెకన్ల పాటు విమానం అదుపు తప్పింది. విమానానికి కీలకమైన ఎలివేటర్లు, ఐలరాన్లు పైలట్ నియంత్రణ కోల్పోయి వాటంతట అవే కదలడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆటోపైలట్ వ్యవస్థ డిస్‌కనెక్ట్ అయ్యింది.
ఆ సమయంలో విమానాన్ని నడుపుతున్న కో-పైలట్, విమానం కుప్పకూలుతుందనే హెచ్చరికలు రావడంతో, పరిస్థితిని చక్కదిద్దేందుకు సైడ్-స్టిక్‌ను ముందుకు నెట్టారు. అయితే, హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయకపోవడంతో విమానం వెంటనే స్పందించలేదు. కొన్ని సెకన్ల తర్వాత హైడ్రాలిక్ వ్యవస్థలు తిరిగి పనిచేయడం ప్రారంభించగానే, ఒక్కసారిగా విమానం వేగంగా కిందికి దూసుకెళ్లింది. ఈ ఆకస్మిక పరిణామంతో సీట్లలో కూర్చొని లేని ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది గాల్లోకి ఎగిరిపడి గాయపడ్డారు. ఘటన సమయంలో విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో సహా మొత్తం 145 మంది ఉన్నారు.
ఈ ఘటన అనంతరం నిర్వహించిన దర్యాప్తులో పైలట్-ఇన్-కమాండ్ గంజాయి తీసుకున్నట్టు పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఆగస్టు 13 నుంచి తమ గ్రూప్‌లోని పైలట్లందరికీ తప్పనిసరిగా డ్రగ్స్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విమాన డేటాను ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లో ఉన్న ఎయిర్‌బస్ సాంకేతిక కేంద్రానికి పంపి విశ్లేషిస్తున్నారు.