'పంచధారల' వారసత్వ సంపదకు ముప్పు.. కేంద్రం జోక్యం చేసుకోవాలి: రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి
- రాజ్యసభలో పంచధారల మైనింగ్ అంశాన్ని లేవనెత్తిన వైవీ సుబ్బారెడ్డి
- వారసత్వ కట్టడాల పరిరక్షణకు మైనింగ్ తక్షణం ఆపాలని డిమాండ్
- కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు
- అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పాత్రపై సీబీఐ విచారణకు అభ్యర్థన
- 10 రోజుల్లోగా కేంద్ర బృందం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రుల హామీ
ఆంధ్రప్రదేశ్‌లోని పంచధారల వారసత్వ ప్రాంతం సమీపంలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పార్టీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం రాజ్యసభలో గళం విప్పారు. ప్రాచీన బౌద్ధ స్థూపాలు, ఆలయాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, మైనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మినరల్స్ సవరణ బిల్లు, 2026పై జరిగిన చర్చలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పంచధారలలోని బౌద్ధ క్షేత్రం, పురాతన ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో మైనింగ్ జరుగుతోందని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణం గుండా ప్రవహించే ఐదు సహజ నీటి ప్రవాహాల వల్లే ఆ ప్రాంతానికి 'పంచధారల' అని పేరు వచ్చిందని, ప్రస్తుత మైనింగ్ కార్యకలాపాలతో ఆ పవిత్ర జలధారలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో వెంటనే తనిఖీలు చేపట్టాలని, పర్యావరణ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని, అన్ని అనుమతులను పునఃపరిశీలించాలని కోరారు. ఈ అధ్యయనాలు పూర్తయ్యే వరకు మైనింగ్‌ను నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఖనిజ సంపద ప్రజలదని, దాని నిర్వహణలో పారదర్శకత ఉండాలని సుబ్బారెడ్డి అన్నారు. మైనింగ్ విధానాలను రూపొందించేటప్పుడు రాష్ట్రాల ఆదాయానికి, స్థానిక ప్రజల జీవనోపాధికి, పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తుచేశారు.
అంతకుముందు, ఇదే అంశంపై వైసీపీ ఎంపీలు గొల్ల బాబూరావు, గుమ్మ తనూజారాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు ఢిల్లీలో కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మైనింగ్, బ్లాస్టింగ్ వల్ల పవిత్ర జలధారలు దెబ్బతింటున్నాయని అధికారిక విచారణలో తేలినట్లు వారు మంత్రులకు వివరించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రులు.. పది రోజుల్లోగా ఒక కేంద్ర బృందాన్ని పంపి మైనింగ్ కార్యకలాపాలను పరిశీలిస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ తనూజారాణి తెలిపారు.
ఈ వ్యవహారంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పాత్రపై సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేస్తే సరిపోదని, అక్రమ తవ్వకాలకు నిబంధనల ప్రకారం సుమారు రూ. 250 కోట్ల జరిమానా విధించాల్సి ఉందని పేర్కొన్నారు. సీఎం రమేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన కోరారు.