నిన్ను అరెస్ట్ చేస్తారనే సరికి మహిళలంతా కళ్లలోంచి నిప్పులు కురిపించాలా?: కవితపై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay fires on Kavitha
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
  • కవితను విచారించిన సీబీఐ 
  • తెలంగాణ మహిళల కళ్లలోంచి నిప్పులు వస్తాయన్న కవిత
  • అప్పుడు మీ కళ్లలోంచి నిప్పులు ఎందుకు రాలేదు? అన్న సంజయ్ 
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ మహిళల కళ్లలోంచి కన్నీళ్లు రావని, నిప్పులు వస్తాయని పేర్కొనడం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. నిన్ను అరెస్ట్ చేస్తారనేసరికి రాష్ట్రంలో మహిళలు కళ్లలోంచి నిప్పులు కురిపించాలా? అని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు జరుగుతుంటే మీ కళ్లలోంచి నిప్పులు ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. 

కేసీఆర్ కుటుంబానికి మానవ హక్కులపై మాట్లాడే నైతిక హక్కులేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. మానవ హక్కులను కాలరాస్తోంది మీ అయ్యేనంటూ కవితపై ధ్వజమెత్తారు. మానవత్వంలేని మృగం కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Bandi Sanjay
Kavitha
Delhi Liquor Scam
CBI
BJP
TRS
Telangana

More Telugu News