Radha: రాధ డ్యాన్సుకు 'వావ్' అంటూ చిరంజీవి స్పందన... వీడియో ఇదిగో!

Chiranajeevi enjoys Radha dance in a party
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల దక్షిణాదికి చెందిన 80వ దశకం సినీ తారలు ముంబయిలో గెట్ టుగెదర్ పార్టీలో కలిసిన సంగతి తెలిసిందే. దక్షిణాది తారలకు జాకీష్రాఫ్, పూనమ్ థిల్లాన్ వంటి బాలీవుడ్ తారలు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ నటులందరూ ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన అలనాటి అందాలనటి రాధ తన డ్యాన్స్ తో అలరించారు. 

అప్పట్లో చిరంజీవికి ఈడుజోడు అన్నట్టుగా వేగంగా డ్యాన్స్ చేసి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రాధ... ముంబయిలో జరిగిన కార్యక్రమంలోనూ ఆనాటి స్టయిల్ ను మిస్ కాకుండా డ్యాన్స్ చేశారు. ఓ హిందీ హిట్ పాటకు ఆమె స్టెప్పులు వేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి వావ్, ఫెంటాస్టిక్ అంటూ ముగ్ధుడయ్యారు. అంతేకాదు, లేచి వచ్చి మరీ ఒకనాటి తన హీరోయిన్ ను అభినందించారు. విక్టరీ వెంకటేశ్ సైతం రాధ డ్యాన్సుకు ఫిదా అయ్యారు. 

దీనికి సంబంధించిన వీడియోను రాధ తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. తన ఫేవరెట్ సాంగ్ కు డ్యాన్స్ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. అంతకంటే ముఖ్యంగా, చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, పూనమ్ థిల్లాన్, స్వప్న, సరిత అక్క వంటి వారు అభినందనల జల్లు కురిపించడం మరింత ఆనందానికి గురిచేసింది అని వెల్లడించారు.
Go Back to Shorts
Radha
Dance
Chiranjeevi
80s
Mumbai
South India

More Telugu News