మార్క్ జుకర్ బర్గ్ కు షాక్.. 1.20 కోట్ల నుంచి 10 వేల దిగువకు పడిపోయిన ఫేస్ బుక్ ఫాలోయర్ల సంఖ్య
- లక్షలాది మంది ఫాలోయర్లను కోల్పోతున్న ఫేస్ బుక్ యూజర్లు
- 9 లక్షల మంది ఫాలోయర్లను కోల్పోయానన్న తస్లీమా నస్రీన్
- ఈ సమస్యపై పని చేస్తున్నామన్న ఫేస్ బుక్
మరోవైపు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా అధికార ప్రతినిధి దీనిపై స్పందిస్తూ... తమ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ లో ఫాలోయర్లకు సంబంధించి కొందరు అస్థిరమైన కౌంట్ ను చవిచూస్తున్నారని చెప్పారు. తాము ఈ సమస్యపై పని చేస్తున్నామని... త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు. జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు.