నాపై పోటీ చేయాలనుకునేవారు మంచి పనులు చేయండి: కేటీఆర్
- తాను ఎన్నికల్లో ఎప్పుడూ డబ్బు, మద్యం పంచలేదన్న మంత్రి
- తన పుట్టిన రోజున ఆర్భాటాలకు పోకుండా ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమాన్ని ప్రారంభించానని వెల్లడి
- మంచి పనులు చేద్దాం, ప్రజల మనసులను గెలుచుకుందామని రాజకీయ నేతలకు పిలుపు
అధికారం శాశ్వతమని కొందరు అనుకుంటారు
అధికారం రాగానే అది శాశ్వతమని కొందరు ఊహించుకుంటారని.. కాని వచ్చిన అవకాశాన్ని ఓ మంచి పనిని చేయడానికి ఉపయోగించాలని మంత్రి కేటీఆర్ రాజకీయ నాయకులకు సూచించారు. తాను అలాంటి మంచి పనులపై దృష్టి పెట్టానని చెప్పారు. తన పుట్టిన రోజున అనవసర ఖర్చులకు, ఆర్భాటాలకు పోకుండా.. నలుగురికి ఉపయోగపడే విధంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ప్రారంభించానని వివరించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలనుకునే వారు కూడా ఈ విధంగా మంచి పనులు చేయాలని సూచించారు.