తెలంగాణలో తాజాగా 99 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 9,450 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 49 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 106 మంది
- ఇంకా 768 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,36,621 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,31,742 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 768 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.
