విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ సమావేశం... మరోమారు గైర్హాజరైన కేశినేని నాని
- జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చ
- నేతల మధ్య విభేదాల పరిష్కారంపై కీలక చర్చ
- ఢిల్లీలో ఉన్నందున భేటీకి హాజరు కాని కేశినేని నాని
ఇదిలా ఉంటే... ఇటీవలే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో జరిగిన జిల్లా నేతల సమావేశానికి విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని హాజరు కాని విషయం తెలిసిందే. నాడు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన ఆ సమావేశానికి హాజరు కాలేదు. తాజాగా మంగళవారం నాటి సమావేశానికి కూడా అదే కారణంతో కేశినేని నాని గైర్హాజరయ్యారు.