రిలీఫ్ కోసం రొమాంటిక్ చిత్రాలను చేయాలనుకుంటున్నా: అమలాపాల్
- ఈ నెల 12న విడుదల కాబోతున్న అమలాపాల్ 'కడావర్' చిత్రం
- ఈ సినిమాను సొంతంగా నిర్మించిన అమలాపాల్
- తన సినిమాను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారని మండిపాటు
ఈ సందర్భంగా అమలాపాల్ మీడియాతో ముచ్చటిస్తూ... ఈ సినిమాను నిర్మించడానికి తాను ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చింది. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి, పోరాటాలు చేసి సినిమాను పూర్తి చేశామని తెలిపింది. సినిమాను విడుదల చేసే విషయంలో కూడా ఎన్నో ఆటంకాలు కలిగాయని చెప్పింది. తన సినిమా విడుదల కాకుండా కొందరు వ్యక్తులు తెర వెనుక ఎంతో ప్రయత్నించారని మండిపడింది. అయితే, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ముందుకొచ్చిందని చెప్పింది.
'కడావర్' సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని అమలాపాల్ తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర కొత్తగా, బలమైనదిగా ఉంటుందని చెప్పింది. కథ బాగున్నందుకే తాను నిర్మాతగా మారానని తెలిపింది. సినిమా నిర్మాణంలో తన తల్లి, సోదరుడు ఎంతో సహకరించారని చెప్పింది. వరుసగా క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ సినిమాలు చేశానని... ఇకపై కాస్త రిలీఫ్ కోసం రొమాంటిక్ చిత్రాలు చేస్తానని తెలిపింది.