తెలుగు తెరపైకి నందమూరి వంశం నుంచి మరో వారసుడు.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన బాలయ్య
- బసవతారకరామ క్రియేషన్స్ స్థాపించిన నందమూరి జయకృష్ణ
- హీరోగా పరిచయమవుతున్న నందమూరి చైతన్య కృష్ణ
- ఫస్ట్ లుక్ విడుదల చేసిన బాలకృష్ణ
ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ.. బసవతారకరామ క్రియేషన్స్ నుంచి తన కుమారుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. సరికొత్త కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘రక్ష’, ‘జక్కన్న’ ఫేం దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు జయకృష్ణ తెలిపారు.