టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు... తొలి బంతికే కోహ్లీని అవుట్ చేసిన సన్ రైజర్స్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు... తొలి బంతికే కోహ్లీని అవుట్ చేసిన సన్ రైజర్స్

Sunrisers sent back Kohli with no score
  • ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు
  • కోహ్లీ వికెట్ సాధించిన జగదీశ సుచిత్
  • దిగ్భ్రాంతికి గురైన బెంగళూరు శిబిరం
ఆదివారం కావడంతో ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ (రెండు మ్యాచ్ లు) నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ముంబయి వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే, తొలి బంతికే ఆ జట్టుకు దిమ్మదిరిగిపోయింది. ఓపెనర్ గా దిగిన విరాట్ కోహ్లీ (0)ని సన్ రైజర్స్ బౌలర్ జగదీశ సుచిత్ ఇన్నింగ్స్ మొదటి బంతికే డక్ అవుట్ చేశాడు. దాంతో బెంగళూరు శిబిరం దిగ్భ్రాంతికి గురికాగా, సన్ రైజర్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఆ ఓవర్లో సుచిత్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుతం బెంగళూరు స్కోరు 1 ఓవర్ అనంతరం 1 వికెట్ నష్టానికి 2 పరుగులు. క్రీజులో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పాటిదార్ ఉన్నారు.
Sunrisers Hyderabad
Virat Kohli
RCB
Toss
Batting
Double Header
IPL

More Telugu News