Virat Kohli: మ్యాక్స్ వెల్-వినీ రామన్ జంటకు రిసెప్షన్ ఏర్పాటు చేసిన ఆర్సీబీ... 'ఊ అంటావా మామా' పాటకు చిందేసిన కోహ్లీ!

Kohli rocks Maxwell and Vini Raman wedding reception arranged by RCB
షార్ట్స్‌లో చూడండి
ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్, భారత సంతతి అమ్మాయి వినీ రామన్ ఇటీవల పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యాక్స్ వెల్ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో, బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యం మ్యాక్స్ వెల్-వినీ రామన్ ల పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మ్యాక్స్ వెల్, వినీ జోడీ భారత సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంది. ఇతర ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు సైతం భారత సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు. 

కాగా, తన బెస్ట్ ఫ్రెండ్ మ్యాక్స్ వెల్ పెళ్లి రిసెప్షన్ లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సందడి చేశాడు. ఇతర ఆటగాళ్లతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ముఖ్యంగా, యువ ఆటగాడు షాబాజ్ అహ్మద్ తో కలిసి పుష్ప చిత్రంలోని ఊ అంటావా పాటకు డ్యాన్స్ చేయడం హైలైట్ గా నిలిచింది. ఇతర ఆటగాళ్లు, జట్టు సహాయకసిబ్బంది చప్పట్లతో హుషారెత్తిస్తుండగా, కోహ్లీ రెచ్చిపోయి మరీ చిందేశాడు. కాగా, ఈ కార్యక్రమానికి కోహ్లీతో పాటు అనుష్క శర్మ కూడా హాజరైంది.
Go Back to Shorts
Virat Kohli
Glenn Maxwell
Vini Raman
Wedding Reception
RCB
IPL

More Telugu News