ఇన్ని అవమానాలు ఎప్పుడూ ఎదుర్కోలేదు: అచ్చెన్నాయుడు
- అసెంబ్లీలో టీడీపీ సభ్యులను అవమానాలకు గురి చేస్తున్నారు
- చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను కూడా అవమానిస్తున్నారు
- మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లమన్న అచ్చెన్న
గత మూడేళ్లుగా సభ సజావుగా జరగడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. తమ కర్తవ్య బాధ్యతలను నెరవేర్చడానికి సభకు హాజరవుతున్నామని తెలిపారు. 30 అంశాలను సిద్ధం చేసుకుని అసెంబ్లీకి వెళ్తున్నామని చెప్పారు. సభలో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లబోమని తెలిపారు. స్పీకర్ తమ్మినేని హుందాగా వ్యవహరించాలని చెప్పారు.
శాసనసభ గౌరవాన్ని వైసీపీ సభ్యులు మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీని కౌరవసభగా మార్చారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం బయట చేసే ప్రకటనలకు, సభ లోపల వ్యవహరించే తీరుకు పొంతన ఉండదని అన్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వెళ్లడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తున్నారు.