అప్పు చెల్లించని కేసు విషయంలో... దాసరి నారాయణరావు కుమారులకు కోర్టు నోటీసులు
- రూ.2.11 కోట్లు అప్పు తీసుకున్న దాసరి అరుణ్, దాసరి ప్రభు
- తిరిగి చెల్లించట్లేదని గుంటూరు జిల్లాకు చెందిన సోమశేఖర్‌రావు పిటిషన్
- ఈ నెల 15లోగా చెల్లించాలని కోర్టు ఆదేశం
అంతకుముందు ఆయన పోలీసు స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనను చంపుతామని దాసరి కుమారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కోర్టులో పిటిషన్ కూడా వేయడంతో దీనిపై ఈ రోజు విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు దాసరి ప్రభు, దాసరి అరుణ్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15లోగా డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.