Advertisement

మంచి పాత్రల కోసమే వేచి చూస్తున్నా.. పెళ్లికి కూడా తొందరలేదు: నిధి అగర్వాల్

Nidhhi Agerwal waiting for good roles and no rush for marriage
  • జీవితంలో దేని గురించి తాను తొందరపడనన్న నిధి అగర్వాల్
  • ప్రాధాన్యత ఉండే పాత్రలు చేయడానికి తమిళ చిత్రసీమ సరైన వేదిక అని వ్యాఖ్య
  • తనది సున్నితమైన మనస్తత్వమన్న నిధి

సినిమా అవకాశాల కోసం తాను ఎప్పుడూ తొందరపడనని... జీవితంలో సినిమాలైనా, పెళ్లయినా దేనికీ హడావుడి పడేది లేదని నటి నిధి అగర్వాల్ స్పష్టం చేసింది. మంచి కథలు, అర్థవంతమైన పాత్రల కోసమే తాను వేచి చూస్తున్నానని తెలిపింది. 'ఈశ్వరన్', 'భూమి', 'కళగ తలైవన్' చిత్రాల తర్వాత తమిళంలో మళ్లీ నటించకపోవడానికి సరైన ప్రాజెక్ట్ రాకపోవడమే కారణమని చెప్పింది. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయడానికి తమిళ చిత్రసీమ సరైన వేదిక అని వ్యాఖ్యానించింది.


పవన్‌ కల్యాణ్‌తో 'హరి హర వీరమల్లు', ప్రభాస్‌తో 'ది రాజా సాబ్' వంటి భారీ చిత్రాల్లో నటించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు నిధి తెలిపింది. ప్రస్తుతం తెలుగు, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే తమిళ సినిమాలకు కాస్త దూరమయ్యానని పేర్కొంది. వృత్తిపరంగా తాను ఎంతో కష్టపడతానని, అయితే మిగతా విషయాల్లో చాలా సోమరినని సరదాగా వ్యాఖ్యానించింది. అలాగే తనది చాలా సున్నితమైన మనస్తత్వమని, అందుకే భావోద్వేగాలను బయటకు చూపించనని తెలిపింది.


ప్రస్తుతం మరో రెండు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని నిధి చెప్పింది. ఇకపోతే ఆమె త్వరలోనే 'మిరాయ్' పార్ట్‌-2 తో పాటు హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ఇన్‌ఫ్లుయెన్సర్' చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Nidhhi Agerwal
Pawan Kalyan
Prabhas
Hari Hara Veera Mallu
The Raja Saab
Nidhhi Agerwal Movies

More Telugu News