Advertisement

బౌలర్‌గా వైభవ్‌ సూర్యవంశీ..! బౌలింగ్‌ కోచ్ ఆసక్తికర విషయాలు

Vaibhav Suryavanshi as a bowler bowling coach reveals interesting facts
  • ప్రస్తుతానికి బ్యాటింగ్‌పైనే పూర్తి దృష్టి
  • సీఓఈలో బౌలింగ్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తామన్న సునీల్‌ జోషి 
  • పురోగతి కనిపిస్తే వేగంగా బౌలర్‌గా తీర్చిదిద్దే యత్నం
  • సూర్యాంశ్‌ షెడ్గేపై ఓర్పు అవసరమన్న జోషి
  • తిలక్‌, అభిషేక్‌ కూడా బౌలింగ్‌ ఆప్షన్లేనని వ్యాఖ్య
జింబాబ్వేతో తొలి టీ20లో మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్న యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ భవిష్యత్తు ప్రణాళికలపై తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌ సునీల్‌ జోషి ఆసక్తికర విషయం వెల్లడించాడు. అతణ్ని బౌలర్‌గా కూడా తీర్చిదిద్దే ఆలోచనలో భారత జట్టు ఉందని తెలిపాడు. ప్రస్తుతం వైభవ్‌ బ్యాటింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టామని, బౌలింగ్‌ను దశలవారీగా మెరుగుపరుస్తామని చెప్పాడు.

బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)లో అవకాశం దొరికినప్పుడల్లా వైభవ్‌ బౌలింగ్‌పై ప్రత్యేకంగా పని చేస్తామని జోషి తెలిపాడు. బౌలింగ్‌లో కూడా అతడు పురోగతి సాధిస్తే, ఆ నైపుణ్యాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నాడు.

అలాగే యువ ఆల్‌రౌండర్‌ సూర్యాంశ్‌ షెడ్గేను హార్దిక్‌ పాండ్యా లేదా శివమ్‌ దూబేతో పోల్చవద్దని జోషి సూచించాడు. అతడు భారత జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునే దిశగా ఉన్నాడని, అతనిపై ఓర్పుతో నమ్మకం ఉంచాలని అన్నాడు.

టీ20 జట్టులో అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హర్ష్‌ దూబే వంటి బ్యాటర్లు కూడా అవసరమైతే బౌలింగ్‌ చేయగలరని జోషి చెప్పాడు. వీరితో డాట్‌ బంతులు ఎక్కువగా వేయడం, ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టడం వంటి విషయాలపై నిరంతరం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించాడు.
Advertisement
Vaibhav Suryavanshi
Sunil Joshi
India vs Zimbabwe T20
Indian Cricket Team
Suryansh Shedge
BCCI Centre of Excellence

More Telugu News