సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- నాగార్జునకి జంటగా అమలాపాల్?
- పూణేలో మొదలెట్టిన రామ్ చరణ్
- హిందీ ప్రాజక్టుల గురించి సమంత
* రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి పూణేలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో చరణ్, కియారా అద్వానీ జంటపై కొన్ని సన్నివేశాలను, ఓ పాటను ఈ షెడ్యూలులో చిత్రీకరిస్తున్నారు.
* భవిష్యత్తులో మరిన్ని హిందీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను అంటోంది కథానాయిక సమంత. 'హిందీ సినిమాలు చేయాలంటే ఉత్తరాదిన నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారా? అన్న సంశయం ఇంతకుముందు ఉండేది. అయితే, 'ఫ్యామిలీ మేన్ 2' సీరీస్ ని బాగా రిసీవ్ చేసుకోవడంతో, ఇప్పుడు మరిన్ని హిందీ ప్రాజక్టులు చేయాలని కోరుకుంటున్నాను' అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.