డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు.. టీడీపీ నేత ధూళిపాళ్లకు పోలీసుల నోటీసులు
- ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్‌తో ఏపీకి సంబంధాలు
- ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
- ఇంటికి వచ్చి నోటీసులు అందించిన కాకినాడ పోలీసులు
ఈ క్రమంలో ధూళిపాళ్ల కూడా ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దీంతో కాకినాడ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో కోరారు. విచారణకు హాజరై ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని సూచించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల నివాసానికి నిన్న వచ్చిన కాకినాడ పోలీసులు నోటీసులు అందజేశారు.