నిరంకుశ పాలనను బొద్దింకలు మోకాళ్లపైకి వంచారు: ప్రకాశ్ రాజ్
- నీట్ వ్యవహారంపై విద్యార్థుల పోరాటం
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- సోషల్ మీడియాలో ప్రకాశ్ రాజ్ స్పందన
- కాక్రోచెస్ కి నా అభినందనలు అంటూ ట్వీట్
- యువత పక్షాన నిలబడిని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్న ప్రకాశ్ రాజ్
ఒక నిరంకుశ పాలనను సైతం సామాన్యులు మోకాళ్లపై కూర్చోబెట్టగలరని నిరూపించారని నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్న సామాజిక, రాజకీయ పరిణామాలపై నిత్యం తనదైన శైలిలో నిలదీసే ప్రకాశ్ రాజ్... తాజాగా నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై స్పందించారు. సీజేపీ ఆధ్వర్యంలో సాగిన పోరాటాన్ని, దానికి మద్దతుగా నిలిచిన సోనమ్ వాంగ్‌చుక్, యువతను ఉద్దేశించి ఎక్స్ వేదికగా పదునైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాన్ని, అధికారాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ ఉదంతం నిరూపించిందని పేర్కొంటూ ప్రకాశ్ రాజ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. "నా ప్రియమైన 'కాక్రోచెస్' (బొద్దింకలు)కి నా అభినందనలు. ప్రియమైన సోనమ్ వాంగ్‌చుక్ సర్ మరియు యువత పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఒక నిరంకుశ పాలనను సైతం మీరు మోకాళ్లపైకి తెప్పించగలరని నిరూపించారు" అని పేర్కొంటూ #justasking అనే హాష్‌ట్యాగ్‌ను జోడించారు.