Sunny Leone: 'పుష్ప' ఐటెం సాంగులో సన్నీ లియోన్?

Sunny Leone in Pushpa item song
షార్ట్స్‌లో చూడండి
దర్శకుడు సుకుమార్ సినిమా అంటే అందులో అన్ని మసాలాలు దట్టిస్తాడు. ముఖ్యంగా ఒక ఐటెం సాంగ్ తప్పకుండా ఉంటుంది. అతని రెగ్యులర్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇక ఆ పాట ట్యూన్ విషయంలో రెచ్చిపోతాడు. వీరికి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తోడైతే ఇక ఈ ఐటం పాట గురించి చెప్పేక్కర్లేదు. ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా అది మాంచి మసాలాతో ముస్తాబవుతుంది.
 
ఇక విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రకథ విస్తృతిని బట్టి దీనిని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్ణయించారు. ఈ ఏడాది తొలి భాగం, వచ్చే ఏడాది రెండో భాగం విడుదలవుతాయి.

ప్రస్తుతం తొలి భాగం కోసం దేవిశ్రీ ప్రసాద్ ఫుల్ జోష్ తో సాగే ఓ ఐటెం సాంగును రెడీ చేస్తున్నాడు. ఈ పాటలో బన్నీతో పాటు డ్యాన్స్ చేసే భామ విషయంలో ఇప్పటి వరకూ పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ సెక్సీ భామ సన్నీ లియోన్ పేరు వినిపిస్తోంది. తాజాగా చిత్ర నిర్మాతలు ఈ ముద్దుగుమ్మను సంప్రదించారని, అయితే ఆ పాటలో నటించడానికి 90 లక్షల వరకు అడిగిందని తెలుస్తోంది. సినిమాలో ఆమె ఉంటే ఆ గ్లామర్ వేరు కాబట్టి, రేటు కాస్త అటూ ఇటూలో సన్నీని కన్ఫర్మ్ చేసేస్తారని అంటున్నారు.
Go Back to Shorts
Sunny Leone
Allu Arjun
Sukumar
Devisri Prasad

More Telugu News