స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. సీజీఎల్‌ 2026 పరీక్షల తేదీలు ఖరారు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. సీజీఎల్‌ 2026 పరీక్షల తేదీలు ఖరారు

Staff Selection Commission Finalizes CGL 2026 Exam Dates
  • ఎస్ఎస్‌సీ సీజీఎల్‌ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
  • సెప్టెంబర్ 30 నుంచి టైర్-1, టైర్-2 పరీక్షలు
  • కంప్యూటర్ ఆధారితంగా టైర్-1 పరీక్ష నిర్వహణ
  • ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగటివ్ మార్కులు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) ఎగ్జామినేషన్-2026కు సంబంధించిన పరీక్షా షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సీజీఎల్ టైర్-1, టైర్-2 పరీక్షలను ఈ నెల 30 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) జరగనున్నాయి. టైర్-1 పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడి ఉంటుంది.

టైర్-1 పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 

పరీక్షా సమయం ఒక గంట కాగా, ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. ఇంగ్లీష్ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరీక్షలు ముగిసిన వెంటనే ప్రాథమిక 'కీ'ని విడుదల చేసేందుకు ఎస్ఎస్‌సీ కసరత్తు చేస్తోంది.
Advertisement
Staff Selection Commission
SSC CGL 2026 Exam Dates
Combined Graduate Level Schedule
SSC Tier 1 CBT Pattern
Government Jobs 2026
SSC CGL Tier 2 Dates

More Telugu News