పరుగులు తీస్తున్న పెట్రో ధరలు.. 14 రాష్ట్రాల్లో వంద రూపాయలు దాటిన వైనం
- పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో 18 రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు
- ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు 34సార్లు పెంపు
- మూడు రాష్ట్రాల్లో రూ. 100 దాటిన డీజిల్ ధర
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.99.51గా ఉండగా, హైదరాబాద్‌లో రూ.103.41గా ఉంది. డిజిల్ ధర లీటరు రూ. 97.40గా ఉంది. కాగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో వరుసగా 18 రోజులపాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు 34 సార్లు పెరగడం గమనార్హం.