యువ నటి నిధి అగర్వాల్ కు తమిళనాడులో విగ్రహం... పాలాభిషేకాలు!
- తమిళంలో రెండు చిత్రాల్లో నటించిన నిధి
- వాలంటైన్స్ డే సందర్భంగా చెన్నైలో విగ్రహం ఏర్పాటు
- నిధి విగ్రహానికి పూజలు, హారతులు
- ఫొటోలు చూసి నమ్మలేకపోయిన నిధి
- మరిన్ని మంచి పాత్రలతో అలరిస్తానని వెల్లడి
ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు సందర్భంగా చెన్నైలో నిధికి విగ్రహం ఏర్పాటు చేయడమే కాదు, పూజలు చేసి హారతులు ఇచ్చారు. అంతేకాదు, పాలాభిషేకాలు కూడా నిర్వహించి, కేకులు కట్ చేసి ఆమెపై తమ ప్రేమను చాటుకున్నారు. కాగా, దీనికి సంబంధంచిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను చూసిన నిధి అగర్వాల్ నమ్మలేకపోయింది. వాలంటైన్స్ డే సందర్భంగా తాను పొందిన అత్యుత్తమ కానుక ఇదేనని తెలిపింది.
అసలా ఫొటోలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని, మరిన్ని మంచి సినిమాలు, పాత్రలతో తమిళ అభిమానులు అలరిస్తానని వెల్లడించింది. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన క్రిష్ దర్శకత్వంలో నటిస్తోంది. ఆమె సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆపై మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలతో మంచి గుర్తింపు అందుకుంది.