మహారాష్ట్ర ఆసుపత్రిలో హృదయవిదారక ఘటన.. అగ్నిప్రమాదంలో 10 మంది నవజాత శిశువుల మృతి
- భండారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
- ఎస్ఎన్‌సీయూలోని 17 మంది చిన్నారుల్లో 10 మంది మృతి
- తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు
ఏడుగురు చిన్నారులను రక్షించామని, పదిమంది చనిపోయారని జిల్లా సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండాటే తెలిపారు. నవజాత శిశువుల యూనిట్‌లో పొగ రావడాన్ని తొలుత ఓ నర్సు గుర్తించినట్టు చెప్పారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. అయితే, షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు.