26/11కు పన్నెండేళ్లు... నాటి వీరులను తలచుకుంటున్న ముంబై!
- నాడు విరుచుకుపడిన ముష్కరమూక
- 166 మంది అమాయక ప్రజలు బలి
- నేడు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు
ఈ మారణ హోమానికి నేటితో పన్నెండేళ్లు పూర్తి కావడంతో, అమరులకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, కరోనాను దృష్టిలో ఉంచుకుని ప్రజలను మాత్రం పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నామని, దక్షిణ ముంబైలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఇటీవల నిర్మించిన స్మారక చిహ్నం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్ థాకరేతో పాటు పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, అమరులైన పోలీసుల కుటుంబీకులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.