జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై క్లారిటీ ఇచ్చిన ఎల్.రమణ
- డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్
- టీడీపీ పోటీ చేస్తుందని చెప్పిన రమణ
- బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని వెల్లడి
గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఈరోజు కానీ, రేపు కానీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. పొత్తులు లేకుండానే ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని తెలిపారు. అయితే అన్ని స్థానాల్లో కాకుండా కేవలం బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని చెప్పారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది చంద్రబాబేనని... నగరంలో ఓటు అడిగే హక్కు టీడీపీకి మాత్రమే ఉందని తెలిపారు.